- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఉచిత విద్యుత్ పథకంలో కీలక మార్పులు
దిశ వెబ్‌డెస్క్: వ్యవసాయ ఉచిత విద్యుత్ సరాఫరా పథకంలో ఏపీ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. దీంతో వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఉచిత విద్యుత్ సబ్సిడీని నగదు రూపంలో రైతుల ఖాతాలకు ప్రభుత్వం చెల్లించనుంది. వినియోగం మేరకు వచ్చిన బిల్లులను రైతులే డిస్కంలకు చెల్లించేలా ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. దీనిలో భాగంగా వ్యవసాయ ఉచిత విద్యుత్‌కు రూ.8,400 కోట్లు ఖర్చు అవుతోందని ప్రభుత్వం పేర్కొంది.
ఈ వ్యవసాయ ఉచిత విద్యుత్ పథకం ద్వారా రైతులకు నెలవారీ నమోదైన బిల్లు ముందుగానే రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. ప్రభుత్వం నుంచి అందుకున్న బిల్లు మొత్తాన్ని తిరిగి రైతులు కంపెనీకి చెల్లించాలి. దీంతో ప్రభుత్వం నుంచి రైతులకు ఎంత మొత్తంలో ఆర్థిక సాయం అందుతుందనేది తెలుస్తోంది. కేంద్రం సూచనలకు అనుగుణంగా ఉచిత విద్యుత్‌కు నగదు బదిలీ పథకం అమలుకు నిర్ణయించినట్లు వెల్లడించింది. 2021-22 ఆర్థిక సంవత్సరం నుంచి రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.