- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సుప్రీం మెట్లెక్కిన ఏపీ ప్రభుత్వం
దిశ, వెబ్‌డెస్క్: ఏబీ వెంకటేశ్వరరావు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. ఏపీ ప్రభుత్వం తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌ను సుప్రీంకోర్టు జులై 6 తర్వాత విచారించే అవకాశం ఉంది. కాగా, ఇదివరకే ఏపీ మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సుప్రీంకోర్టులో కేవియట్ దాఖలు చేశారు. వాదనలు వినకుండా ఎటువంటి ఆదేశాలు ఇవ్వకూడదని సుప్రీంకోర్టును కోరడం గమనార్హం.
భాద్యాతాయుతమైన పదవిలో ఉంటూ అక్రమాలకు పాల్పడ్డారని, నిఘా పరికరాల కొనుగోళ్లలో అవినీతి చేశారన్న ఆరోపణలతో వైసీపీ ప్రభుత్వం వెంకటేశ్వరరావుపై సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన క్యాట్‌ను ఆశ్రయించిన ఫలితం లేకుండా పోయింది. అనంతరం ఏబీ వెంకటేశ్వరరావు హైకోర్టులో రిట్ పిటిషన్ వేయగా ఏపీ ప్రభుత్వం విధించిన సస్పెన్షన్ చెల్లదు అంటూ తీర్పునిచ్చింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేసిన ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించింది.