- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
గుడ్డి గుర్రానికి పళ్లు తోమారా !
దిశ, వెబ్‌డెస్క్: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు అర్థం పర్థం లేకుండా అసెంబ్లీని రద్దు చేయాలన్న డిమాండ్ సమంజసం కాదని స్పష్టం చేశారు. మూడు రాజధానులపై ప్రజల స్పందన తెలుసుకోవాలంటే 23మంది టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు వెళ్లాలని తేల్చిచెప్పారు. త్రీ కేపిటల్స్ విషయంలో మళ్లీ ఎన్నికలకు వెళ్లే అవసరం జగన్ సర్కార్‌కు లేదని సజ్జల వ్యాఖ్యానించారు. టీడీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయాలని చంద్రబాబు కోరితే ఆయనకు ఎంమంది మద్ధతిచ్చేది కూడా తెలుస్తుందన్నారు. ఐదేళ్ల కాలంలో గుడ్డి గుర్రానికి పళ్లు తోమేలా చంద్రబాబు పాలన సాగించారని, చినుకులు పడితే తడిసేలా భవనాలు నిర్మించారని.. టీడీపీ నేతలకు మాత్రమే అమరావతి కామధేనువు అన్నారు.
అమరావతిలో రాజధాని టీడీపీ చెప్పిందా ?
అమరావతిలో రాజధాని ఏర్పాటు చేస్తామని టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పలేదన్నారు. ప్రజల అనుమతి, నిపుణుల కమిటీ సిఫార్సు లేకుండానే నారాయణ కమిటీతో రాజధానిని ఏర్పాటు చేశారన్నారు. చంద్రబాబు అనుచరుల రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే రాజధాని ఏర్పాటు చేశారని మండిపడ్డారు. శివరామకృష్ణ కమిటీ సూచనలను పాటించకుండా పక్కా ప్లాన్ ప్రకారమే అమరావతిని రాజధాని చేసి, ఇప్పుడు రాజధాని వికేంద్రీకరణ బిల్లుపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. అసలు చంద్రబాబు మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నారని, ముందురోజు మాట్లాడిన విషయాన్ని మరుసటి రోజు గుర్తుంచుకోవట్లేదన్నారు. సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ కన్ఫ్యూజ్ అవుతున్నారని సజ్జల పేర్కొన్నారు.