ఏపీలో పరీక్షలన్నీ వాయిదా

by Shyam |
ఏపీలో పరీక్షలన్నీ వాయిదా
X

కరోనా వ్యాప్తి నిరోధానికి విధించిన లాక్‌డౌన్ గడువు ముగియని నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేస్తున్ననట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. ఇప్పటికే నిలిచిన పరీక్షలతో పాటు వివిధ సంస్థల్లో, వివిధ కోర్సల్లో ప్రవేశానికి నిర్వహించాల్సిన పరీక్షలన్నింటినీ వాయిదా వేస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఏపీలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాల్సి ఉన్న సంగతి తెలిసిందే. విద్యార్థుల భవిష్యత్‌ను నిర్ణయించే పదోతరగతి పరీక్షలు నిర్వహించకుండా ప్రమోట్ చేసే అవకాశం లేకపోవడంతో ఆ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్షలు, కరోనా వ్యాప్తి విద్యాశాఖాధికారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి.

మరోవైపు ఇంటర్ పరీక్షలు నిర్వహించినా వాటి వాల్యూయేషన్‌కు మార్గం లేకుండా పోయింది. స్పాట్ విధులు కేటాయించినప్పటికీ లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో వారిని తరలించే అవకాశం లేకపోవడంతో వారి ఫలితాలు వెల్లడయ్యేందుకు సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఈ రెండు ప్రధాన అర్హతలుగాగల ప్రవేశ పరీక్షలన్నింటినీ ఏపీ ప్రభుత్వం వాయిదా వేసింది.

సీప్ (పాలిటెక్నిక్) ఎంసెట్, ఈ సెట్, ఆ సెట్ వంటి ప్రధాన ప్రవేశ పరీక్షలన్నీ వాయిదా పడ్డాయి. లాక్‌డౌన్ ముగిసిన తరువాత ఆయా పరీక్షలను ఎప్పుడు నిర్వహించేది అధికారులు వెల్లడించనున్నారు. కాగా, అధికారుల కంటే ఎక్కువ ఒత్తిడిలో విద్యార్థులున్నారు. ఒత్తిడి, భయంతో కూడిన సెలువులు కావడంతో పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు? ప్రవేశాలు ఎప్పుడు కల్పిస్తారు? వంటి అనుమానాలతో సతమతమవుతున్నారు.

Tags: ap, education department, ap higher education department, entrance exam, postponed

Advertisement

Next Story

Most Viewed