ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా..

by srinivas |   ( Updated:2021-07-28 06:19:51.0  )
ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా..
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీలో కరోనా వైరస్ తన ప్రతాపం చూపిస్తోంది. ఇప్పటికే పలువురు ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు కరోనా బారినపడ్డారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి కరోనా బారిన పడ్డారు. గత రెండు రోజులుగా ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో బుధవారం కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచనమేరకు ఆయన హోం ఐసోలేషన్‌లో చికిత్సపొందుతున్నారు. తన ఆరోగ్యం బాగానే ఉందని.. త్వరలోనే తాను పూర్తి ఆరోగ్యంతో బయటకు వస్తానని స్పష్టం చేశారు. అయితే ఇటీవల కాలంలో తనను కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

Advertisement

Next Story