నాపై మరింత బాధ్యత పెరిగింది : జగన్

by srinivas |   ( Updated:2021-03-14 14:00:10.0  )
acm jagan
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో అధికార వైసీపీ పార్టీ సంచలన విజయం నమోదు చేసింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వైసీపీ హవా కొనసాగింది. తాజాగా.. దీనిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. వైసీపీ పట్టం కట్టిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ‘ఈ గొప్ప విజయం ప్రజలది. దేవుని దయతో ప్రతి అక్కచెల్లెమ్మా , ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత మనస్ఫూర్తిగా ఆశీర్వదించడం వల్ల ఈ చారిత్రక విజయం సాధ్యమైంది. ఈ విజయం నా మీద మీరు పెట్టుకున్న నమ్మకాన్ని, బాధ్యతను మరింత పెంచింది. ఇంకా మంచి చేయడానికి మీ కుటుంబంలో ఒకరిగా మరింత తాపత్రయ పడతాను. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ప్రతి సోదరుడికి, అక్కచెల్లెమ్మకూ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను’ అంటూ ట్వీట్‌ చేశారు.

Advertisement

Next Story