తిరుమలకు ఆ ఇద్దరు సీఎంలు

by srinivas |
తిరుమలకు ఆ ఇద్దరు సీఎంలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుమల బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం 6.30 గంటలకు సీఎం జగన్.. స్వామి వారిని దర్శనం చేసుకొని ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 7 గంటలకు అత్యంత వైభవంగా నిర్వహించే సుందరకాండ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇదే కార్యక్రమంలో కర్ణాటక సీఎం యడియూరప్ప కూడా పాల్గొననున్నారు. అనంతరం 8 గంటలకు ఇద్దరు సీఎంలు కలిసి కర్ణాటక సత్రాల భవన నిర్మాణానికి భూమి పూజ చేయనున్నారు.

Advertisement

Next Story