జగన్ ఢిల్లీ టూర్ వాయిదా..ఎందుకంటే..!

by Anukaran |
cm jagan
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ సీఎం వైఎస్ జగన్ ఢిల్లీ పర్యటన వాయిదా పడింది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో పర్యటన రద్దు అయ్యింది. వాస్తవానికి ఈనెల 4న తిరుపతిలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నేతృత్వంలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరగాల్సి ఉంది. ఆ భేటీ తర్వాత జగన్ ప్రత్యేకంగా షాను కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే షా పర్యటన కాస్త రద్దు అవ్వడంతో ఢిల్లీ వెళ్లి ప్రత్యేకంగా భేటీ కావాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ, అమిత్ షాల అపాయింట్మెంట్ ఖరారు చేయాల్సిందిగా సీఎంవోను ఆదేశించారు. అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో పర్యటన వాయిదా పడింది.

Advertisement

Next Story