అధికారులు అప్రమత్తంగా ఉండాలి

by srinivas |
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
X

దిశ, వెబ్‎డెస్క్: రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో ఆయా జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. భారీ వర్షాలు, వరదలపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రులు సుచరిత, బొత్స సత్యనారాయణ, సీఎస్ నీలం సాహ్ని పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. వర్షం కారణంగా నిలిచిపోయిన విద్యుత్ పనులతో పాటు రోడ్ల పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో ప్రజలకు అవసరమైనా సాయం అందించాలని సూచించారు. వర్షాలతో వచ్చే వ్యాధులపై కూడా దృష్టి సారించాలన్నారు.

Advertisement

Next Story