- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి ప్రయోజనాలు కాపాడాలి : సీఎం జగన్!
దిశ, అమరావతి: గిరిజనులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఎస్టీ ప్రాంతాల పరిధిలో ఉపాధ్యాయ పోస్టులలో ఎస్టీలకు 100 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెచ్చిన జీవోను ఇటీవల సుప్రీం కోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే.. ఆ తీర్పు వల్ల గిరిజన వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ అంశాన్ని డిప్యూటీ సీఎం పుష్ఫ శ్రీవాణి, గిరిజన ఎమ్మెల్యేలు సీఎం జగన్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశంపై సీఎం సమీక్ష జరిపి గిరిజనుల ప్రయోజనాలు కాపాడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ విషయంపై అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌తో సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పును క్షుణ్ణంగా అధ్యయనం చేసి న్యాయపరంగా తీసుకోవాల్సిన చర్యలపై పరిశీలన జరపాలని సీఎం నిర్దేశించారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇచ్చిన చేసిన జీవో అవడం వల్ల తీర్పు ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలపై ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అందువల్ల తెలంగాణ ప్రభుత్వంతోనూ సమన్వయం చేసిన తర్వాతే ముందుకెళ్లాలని సీఎం ఆదేశించారు.