అమిత్ షాతో సీఎం జగన్​ భేటీ

by Anukaran |
అమిత్ షాతో సీఎం జగన్​ భేటీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఢిల్లీలో ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి పర్యటన కొనసాగుతోంది. ఇవాళ సాయంత్రం దేశ రాజధానికి చేరుకున్న ఆయన కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌ షాతో భేటీ అయ్యారు. కరోనా నుంచి కోలుకున్న షా ఆరోగ్య పరిస్థితి గురించి జగన్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ, ఆర్థిక పరిణామాలపై సూత్రప్రాయంగా హోంమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ర్టానికి ప్రత్యేక హోదా, విభజన హామీలు, మూడు రాజధానులు, పెండింగ్ నిధులతో పాటు పలు అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరిగింది. అంతర్వేది ఘటన, అమరావతి భూ కుంభకోణం, ఫైబర్ నెట్‌ కుంభకోణాలపై సీబీఐ దర్యాప్తు అంశాలను అమిత్‌షా కు వివరించారు. వీటన్నింటికీ సంబంధించి ఓ విజ్ఞాపన పత్రాన్ని జగన్ అందజేశారు. సీఎంతో పాటు ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, బాలశౌరి ఉన్నారు. అనంతరం ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో జగన్ భేటీ కానున్నట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story