రాయిటర్స్ కథనం ఉద్దశపూర్వకమే..

by srinivas |
రాయిటర్స్ కథనం ఉద్దశపూర్వకమే..
X

ఏపీ ప్రభుత్వంపై బుదర చల్లేందుకు ఉద్దేశపూర్వకంగానే రాయిటర్స్ సంస్థ కథనం ప్రచురించిందని ఏపీ సీఎం జగన్ మీడియాకు వెల్లడించారు. రాజకీయ లబ్ది పొందేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు రాయిటర్స్‌ చేత కథనం ప్రచురించేలా మేనేజ్ చేశారని ఆయన ఆరోపించారు. దిగజారుడు రాజకీయాలు చంద్రబాబుకు కొత్తేంకాదని సీఎం జగన్ విమర్శించారు. చివరకు కియా మోటర్స్ ఎక్కడకు వెళ్లడం లేదని అనంతపురంలోనే ఉంటుందని మేనేజింగ్ డైరక్టర్ క్లారిటీ ఇవ్వాల్సిన పరిస్థితిని సృష్టించారని మండిపడ్డారు. లక్ష కోట్లు పెట్టి అమరావతిని డెవలప్ చేసేంతా డబ్బులు ప్రభుత్వం వద్ద లేవని అందులో 10వ వంతు ఖర్చు చేస్తే విశాఖ అద్భుతంగా మారుతుందన్నారు. పదేళ్లలో హైదరాబాద్, బెంగళూరు,చైన్నైనగరాలతో విశాఖ పోటిపడుతుందని తెలిపారు. అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్ గానే కొనసాగుతుందని దానిని మార్చేది లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై స్పందించిన జగన్ దానిగూర్చి నేటికి కేంద్రాన్నికోరుతున్నామన్నారు. స్పెషల్ స్టేటస్ ముగిసిన అంశం కాదని మరోసారి తేల్చిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన మాటలకు విరుద్ధంగా ఏపీ బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని వారిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తంచేశారు.

Advertisement

Next Story

Most Viewed