చంద్రబాబుకు సీఐడీ షాక్.. విచారణకు రావాలని నోటీసులు

by Anukaran |   ( Updated:2021-03-15 22:32:16.0  )
చంద్రబాబుకు సీఐడీ షాక్.. విచారణకు రావాలని నోటీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఐడీ అధికారులు హైదరాబాద్ లో మాజీ సీఎం చంద్రబాబు నివాసానికి రెండు బృందాలుగా వచ్చారు. అమరావతి రాజధాని భూముల అమ్మకాలు – కొనుగోళ్ల విషయంలో భారీ అక్రమాలు జరిగాయని, మార్చి 23న జరిగే సీఐడీ అధికారులకు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ నోటీసులు జారీ చేశారు. నోటీసుల్లో చంద్రబాబు పై 120 బి, 166,167, 217 సెక్షన్ల కేసులు నమోదు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. చంద్రబాబుతో పాటూ మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు సర్వ్ చేశారు.

మరోవైపు అమరావతి భూముల క్రయవిక్రయాల్లో అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. రాజధాని ప్రాంత రైతుల నుంచి రూ.50వేలు, రూ.60వేలు ఖరీదు చేసే గజం విలువను రూ.15,00, రూ.2వేలకే విక్రయించారని, అలా విక్రయించిన భూముల్ని చంద్రబాబు, నారాయణలు తన అనుయాయులకు కట్టబెట్టినట్లు ఏపీ సీఐడీ అధికారులు చెబుతున్నారు.

ల్యాండ్‌ సీలింగ్‌ యాక్ట్‌ ప్రకారం రాజధాని భుముల్ని రెసిడెన్షియల్ అవసరాల కోసం వినియోగించుకోకూడదు. కానీ అక్కడ కొంతమంది లబ్ధి చేకూరేలా భూముల్ని విక్రయించినట్లు ఏపీ సీఐడీ అధికారులు చంద్రబాబు, నారాయణలపై కేసులు నమోదు చేశారు.

Advertisement

Next Story