బందరు పోర్టుకు గ్రీన్​సిగ్నల్​

by Anukaran |   ( Updated:2020-11-05 11:51:07.0  )
బందరు పోర్టుకు గ్రీన్​సిగ్నల్​
X

దిశ, ఏపీ బ్యూరో: బందరు పోర్టు నిర్మాణానికి మంత్రి మండలి గ్రీన్​సిగ్నల్ ​ఇచ్చింది. రూ.5,825కోట్ల వ్యయంతో 36నెలల్లో పూర్తి చేసేందుకు ఆమోద ముద్ర వేసింది. గురువారం సచివాలయంలో సీఎం జగన్ ​అధ్యక్షతన మంత్రి మండలి సమావేశమై పలు కీలక అంశాలను చర్చించింది. అనంతరం వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు మంత్రి మండలి తీర్మానాలను వెల్లడించారు. ఇసుక తవ్వకాలను ప్రభుత్వ సంస్థలకు ఇవ్వాలని నిర్ణయించామని, ఒకవేళ ప్రభుత్వ సంస్థలు ముందుకు రాకుంటే టెండర్లు పిలుస్తామని, అప్పుడు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఇసుక బుక్​ చేసుకోవచ్చన్నారు. వినియోగదారులు సొంత వాహనాల్లో నేరుగా ఇసుక రీచ్‌ నుంచే ఇసుక తీసుకు వెళ్లొచ్చని పేర్కొన్నారు.

అటు.. చిరు వ్యాపారులకు జగనన్న చేదోడు పథకానికి ఆమోదం తెలిపిన కేబినెట్.. భూముల రీసర్వే ప్రాజెక్టును ఆమోదించింది. విజయనగరం జిల్లా గాజులరేగలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు 80ఎకరాలు, పాడేరు మెడికల్ కాలేజీకి 35ఎకరాల కేటాయింపునకు ఓకే చెప్పింది. ఉచిత నాణ్యమైన బియ్యం డోర్ డెలివరీని జనవరి నుంచి ప్రారంభించాలని నిర్ణయించింది. ఎర్రచందనం టాస్క్‌ఫోర్స్‌, గుట్కా, జూదం, మత్తు పదార్ధాల అక్రమ రవాణాను నిరోధించే బాధ్యతలను ఎస్​ఈబీకి అప్పగించాలని మంత్రి మండలి తీర్మానించింది.

Advertisement

Next Story