నూతన ఇసుక పాలసీకి ఆమోదం

by srinivas |
నూతన ఇసుక పాలసీకి ఆమోదం
X

దిశ, వెబ్‎డెస్క్:
నూతన ఇసుక పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అన్ని రీచులను ఒకే సంస్థకు అప్పగించాలన్న సిఫార్సులకు ఆమోదించింది. మొదట కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది. అయితే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ముందుకు రాకపోవడంతో పేరుగాంచిన ప్రైవేటు సంస్థకు అప్పగించాలని కేబినెట్ సబ్ కమిటీ సిఫార్సు నిర్ణయం తీసుకుంది. కాగా, ఓపెన్ టెండర్ ద్వారా ఈ ప్రక్రియ చేపట్టాలని మంత్రివర్గ ఉపసంఘం భావించింది. ఈ సిఫార్సులపై చర్చించిన కేబినెట్ ఆమోదించింది.

Advertisement

Next Story