ఏపీలో బ్రిటీష్ పాలన సాగుతోంది :ఏపీ బీజెపీ అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి

by srinivas |   ( Updated:2021-09-07 01:43:32.0  )
bjp
X

దిశ, తెలంగాణ బ్యూరో: బ్రిటిష్ కాలం నాటి అణచివేత దోరణి ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతుందని ఏపీ బీజేపీ అధికార ప్రతినిధి భాను ప్రకాశ్ రెడ్డి ఆరోపించారు. వినాయక చవితి వేడుకలను కేవలం ఇండ్లలోనే జరుపుకోండని ఆదేశాలు ఇవ్వడం హిందువులపై వివక్షతచూపడమేనని మండిపడ్డారు. క్రిస్మస్ వేడుకలను ఇంటికే పరిమితమని చెప్పే దమ్ము సీఎం జగన్ కు ఉందా అని ప్రశ్నించారు. వీధుల్లో మండపాలు పెడితే కేసులు పెడతామని పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని చెప్పారు. కోవిడ్ తీవ్రత అధికంగా ఉన్నప్పుడు తిరుమలలో కోవిడ్ నిబంధనలను పాటిస్తే స్వాగతించామని గుర్తుచేశారు.

ప్రస్తుతం అన్ని కార్యకలాపాలకు అనుమతులిచ్చి వినాయక చవితికి ఎందుకు ఆంక్షలు విధిస్తున్నారని ప్రశ్నించారు. ఏపీ లో చట్టం అమలు కావడం లేదని వైసీపీ నిర్ణయాలు మాత్రమే అమలవుతున్నారని విమర్శించారు. ప్రభుత్వం తన నిర్ణయాలు మార్చుకొని చవితి వేడుకలు ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లను చేపట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం హిందూ పండుగలను ఘనంగా నిర్వహిస్తుంటే ఏపీలో హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పారు. ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు విధించినా వినాయక చవితి వేడుకలను ఘనంగా నిర్వహించి తీరుతామని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed