కరోనా వ్యాక్సిన్ : ఆనందంలో ప్రపంచ దేశాలు.. విచారంలో మందు బాబులు?

by Anukaran |   ( Updated:2021-01-04 22:45:20.0  )
కరోనా వ్యాక్సిన్ : ఆనందంలో ప్రపంచ దేశాలు.. విచారంలో మందు బాబులు?
X

దిశ,వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాపిస్తున్నా.. వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో ప్రపంచ దేశాలు ఆనందం వ్యక్తం చేస్తుంటే మందుబాబులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటారా..? కరోనా వ్యాక్సిన్ టీకా వేయించుకున్న వారు తప్పని సరిగా మద్యాన్ని మానేయాలని, లేదంటే ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుందని కరోనా వ్యాక్సిన్ ఎక్స్ పర్ట్ కమిటీ తెలిపింది.

పెద్దపేగులు, చిన్నపేగుల్లోని కణాలు ప్రమాదకరమైన బ్యాక్టీరియాలను, వైరస్ లను నాశనం చేస్తాయి. తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్ కణాలు ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. కరోనా వైరస్ వ్యాక్సిన్ వేయించుకునే ముందు వ్యాక్సిన్ వేయించుకున్న తరువాత కొంత కాలం పాటు మద్యాన్ని సేవించకూడదు. ఒకవేళ మద్యం సేవిస్తే రోగ నిరోధక వ్యవస్థ వ్యాక్సిన్‌‌కు సానుకూలంగా స్పందించదు. అందుకే టీకా వేయించుకునే వాళ్లు మద్యానికి దూరంగా ఉండాలని ప్రముఖ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ రానక్స్ ఇఖారియా తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో ఇఖారియా మద్యం సేవించే వారి నుంచి శాంపిల్స్ సేకరించారు. ఆ శాంపిల్స్ ఆధారంగా తెల్ల రక్త కణాల్లో ఉండే లింఫోసైట్ 50శాతం పడిపోతున్నట్లు గుర్తించినట్లు చెప్పారు.

అమెరికా మాంచెస్టర్ యూనివర్సిటీ ఇమ్యునాలజిస్ట్ ప్రొఫెసర్ షీనా క్రూక్‌శాంక్ మాట్లాడుతూ లింఫోసైట్లు తగ్గడం వల్ల శరీరం రోగనిరోధక ప్రతిస్పందన ప్రభావం తగ్గిపోతుంది. అందుకే, అందువల్ల కోవిడ్ -19 టీకాలు వేయించుకునే మద్యపానానికి దూరంగా ఉండాలని ప్రొఫెసర్ క్రూక్‌శాంక్ ప్రజలను కోరారు. రోగ నిరోధక వ్యవస్థకు కీలకంగా పనిచేసే తెల్ల రక్త కణాల్లో లింఫోసైట్లు 20 నుండి 40 శాతం వరకు ఉంటాయి. వ్యాక్సిన్ వేయించుకునే ముందు రోజు మద్యం సేవించడం వల్ల లింఫోసైట్ల పనితీరు స్తంభించిపోతుంది. కాబట్టి కరోనావ్యాక్సిన్ విషయంలో ప్రభుత్వ సూచనల్ని ప్రతీ ఒక్కరూ తప్పని సరిగా పాటించాలని కోరుతున్నారు.

Advertisement

Next Story