- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తరుగు పేరుతో మిల్లర్లు దోచుకుంటున్నారు : అన్వేష్ రెడ్డి
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతుల పంటను కొనడం లేదని కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అన్వేష్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. సోమవారం ఆయన గాంధీభవన్‌లో మాట్లాడుతూ.. వాన కాలం వరిధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చేతగాని తనం బయటపడిందన్నారు. 62 లక్షల ఎకరాల్లో వరిసాగు అయ్యిందని ప్రభుత్వం చెబుతున్నా.. ఏ పంట ఎంత వస్తుందనే దానిలో క్లారిటీ ఇవ్వడం లేదన్నారు.
గత నెల రోజుల నుంచి ప్రభుత్వం కేవలం 7.70 లక్షల క్వింటాళ్లను మాత్రమే కొనుగోలు చేసిందన్నారు. మంత్రులు గంగుల కమలాకర్, నిరంజన్ రెడ్డి నియోజక వర్గాల్లో కూడా అంతంత మాత్రమే కొనుగోళ్లు జరిగినట్లు తెలిపారు. మరోవైపు తరుగు పేరుతో రైతులను మిల్లర్లు దోచుకునే కార్యక్రమాన్ని మొదలు పెట్టినా ప్రభుత్వం నియంత్రణ చర్యలు తీసుకోలేదన్నారు. కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సుధీర్ రెడ్డి, మర్రి నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.