మ్యారేజ్ డే స్పెషల్.. విరాట్‌పై ప్రశంసలు కురిపించిన అనుష్క

by Shyam |
virat and anuska
X

దిశ, సినిమా: ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ – బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ ఫోర్త్ మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా భర్తతో కలిసి దిగిన క్యూట్ పిక్స్ అభిమానులతో పంచుకున్న అనుష్క.. ‘జీవించడానికి సులభమైన మార్గం లేదు. మీకు ఇష్టమైన పాటలోని పదాలు ఎల్లప్పుడూ మీ వెంటే ఎలా ఉంటాయో వ్యక్తులతో సంబంధాలు కూడా అలాగే ఉంటాయి. ఈ ప్రపంచంలో మీరు ఉన్నత వ్యక్తిగా ఉండాలంటే అవగాహన, ధైర్యం అవసరం. ఇద్దరూ సమానమని భావించినపుడే వివాహ బంధం సురక్షితంగా నిలబడుతుంది. మానసిక ధైర్యం అవసరమైనప్పుడు ప్రేరేపించి, మనస్సును తేలిక చేసినందుకు ధన్యవాదాలు. నాకు తెలిసిన అత్యంత సురక్షితమైన వ్యక్తి మీరే. నేను ఇంతకు ముందు చెప్పినట్లు నా విజయాల వెనుక మీరు ఉన్నందుకు నేను అదృష్టవంతురాలిని. ప్రేమ, నిజాయితీ, గౌరవంతో ఎల్లప్పుడూ నాకు మార్గదర్శకంగా ఉండండి’ అంటూ తన భర్తపై పొగడ్తల వర్షం కురిపించింది. కాగా ఈ జంట అన్యోన్యతను చూసిన నెటిజన్లు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Advertisement

Next Story