ఆరు నెలల్లో కలిసున్నది 21 రోజులే

by Anukaran |   ( Updated:2020-07-02 00:42:12.0  )
ఆరు నెలల్లో కలిసున్నది 21 రోజులే
X

– విరుష్క జోడి

మోడలింగ్ వరల్డ్‌లో మెరుపులు మెరిపించి.. గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టిన అనుష్కశర్మ బాలీవుడ్‌లో మంచి నటిగా గుర్తింపు పొందింది. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతున్న తను.. నిర్మాతగానూ దూసుకుపోతున్నారు. అటు కెరీర్‌ మంచి దూకుడుమీదున్న తరుణంలోనే స్టార్ క్రికెటర్, భారత రన్ మెషిన్ విరాట్ కోహ్లీతో ప్రేమాయణం సాగించి.. ఏడడుగులు వేసింది. అయితే పెళ్లయిన కొత్తలో తాను, విరాట్ ఏం చేశారో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో వివరించింది అనుష్క.

తాజాగా 'వోగ్' మేగజీన్ కవర్ పేజీ‌పై మెరిసిన అనుష్క శర్మ.. ఆ పత్రికకు ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు. వరుస అవకాశాలు, నిర్మాణ బాధ్యతలతో అనుష్క తన కెరీర్‌లో ఎంత బిజీగా ఉంటుందో తెలిసిందే. ఇటు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా వరుస సిరీస్‌లతో తీరిక లేకుండా గడుపుతుంటారు. సో ఇద్దరూ కూడా తమ తమ కెరీర్‌లో చాలా బిజీగా ఉండేవాళ్లు. ఇదే విషయాన్ని అనుష్క చెప్పింది. ‘మా ఇద్దరిలో ఎవరో ఒకరం వర్క్‌తో బిజీగా ఉండేవాళ్లం. ఆ సమయంలో విరాట్‌ను కలిసేందుకు రోజులు లెక్కపెట్టేదాన్ని. పెళ్లైన మొదటి 6 నెలల్లో విరాట్‌, నేను కలిసి ఉన్నది కేవలం 21 రోజులే. విరాట్‌ను నేను కలిసేందుకు విదేశాలకు వెళ్లినా.. లేదా అతను నన్ను కలిసేందుకు వచ్చినా.. అందరూ ఏమో అనుకుంటారు కానీ, అది ఇద్దరం కలిసి మీల్ చేయడానికి మాత్రమే. ఆ భోజన సమయంలోనే కాసేపు విరాట్‌తో సరదాగా గడిపే ఛాన్స్ దొరికేది’ అని అనుష్క తెలిపారు. ఈ ఇంటర్యూలో విరాట్ కూడా పాల్గొన్నారు.

కోహ్లి మాట్లాడుతూ.. ‘మాది లైఫ్ టైమ్ బంధం. మేము ప్రతిరోజూ ఒకరినొకరు ఎంతో ప్రేమించుకుంటాం. మా బంధం ఎప్పుడూ ప్రేమతో మాత్రమే నిండి ఉంటుంది. ఇది కొన్నిరోజుల క్రితం కాదు జన్మజన్మలుగా ఉందన్న భావన కలుగుతుంది’ అన్నారు.

అనుష్క శర్మ ఇటీవలే పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌తో విజయం సాధించింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్ ఒరిజనల్ ఫిల్మ్ ‘బుల్‌బుల్’కు కూడా అనుష్క శర్మనే నిర్మాతగా వ్యవహరించింది. అయితే హీరోయిన్‌గా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి అనుష్క ఇంతవరకు అనౌన్స్ చేయలేదు. తను చివరగా షారుఖ్ జీరో సినిమాలో కనిపించింది.

Advertisement

Next Story

Most Viewed