- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుష్క పై గవాస్కర్ అసభ్య వ్యాఖ్యలు..
దిశ, స్పోర్ట్స్: భారత దిగ్గజ క్రికెటర్, ప్రస్తుతం ఐపీఎల్లో వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సునీల్ గవాస్కర్ చేసిన చీప్ కామెంట్స్‌పై అనుష్క శర్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ కెప్టెన్ కొహ్లీ బ్యాటింగ్, ఫీల్డింగ్‌లో విఫలమయ్యాడు. ఆ సమయంలో కామెంటేటర్‌గా ఉన్న గవాస్కర్ ‘అభ్యంతరకర వ్యాఖ్యలు’ చేశాడు. లాక్డౌన్ సమయంలో అనుష్క శర్మ బంతులతో ప్రాక్టీస్ చేశాడేమో అంటూ దారుణంగా వ్యాఖ్యానించాడు.
దీనిపై అనుష్క సోషల్ మీడియాలో ఫైర్ అయ్యింది. ‘మిస్టర్ సునీల్ గవాస్కర్ మీ వ్యాఖ్యలు చాలా అసహ్యంగా ఉన్నాయి. నా భర్త గేమ్‌ను నిందించడానికి మధ్యలో నన్నెందుకు తీసుకొని వస్తారు. ఇలాంటి ఆలోచన అసలు మీకెందుకు వచ్చింది. కామెంటేటర్‌గా ప్రతీ క్రికెటర్ వ్యక్తిగత జీవితాలను గౌరవించాలి. అలాగే నన్ను కూడా గౌరవించాలి. 2020 వచ్చినా ఇంకా ఇలా ఆడవారిని బయటకు లాగి అసభ్యకరంగా మాట్లాడటం మారలేదు’ అంటూ అనుష్క ఘాటుగా స్పందించింది. కోహ్లీ ఫ్యాన్స్‌తో పాటు క్రికెట్ అభిమానులు గవాస్కర్ వ్యాఖ్యలపై ఫైర్ అవుతున్నారు.