- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘పాతాళ్ లోక్.. వేరే లోకం’
బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ నిర్మించిన తొలి వెబ్ సిరీస్.. ‘పాతాళ్ లోక్.’ ప్రస్తుతం అమెజాన్‌లో స్ట్రీమింగ్ అవుతున్నఈ సిరీస్‌పై ఎన్ని పాజిటివ్ కాంప్లిమెంట్స్ వచ్చాయో.. నెగెటివ్ రివ్యూస్ కూడా అదేస్థాయిలో ట్రోల్ అయ్యాయి. గూర్ఖాలను కించపరిచారంటూ విమర్శలు వెల్లువెత్తగా బీజేపీ ఎమ్మెల్యే నందకిశోర్ ఈ సిరీస్‌పై కేసు కూడా పెట్టారు. కానీ, వీటన్నింటినీ లెక్కే చేయలేదు అనుష్క.
ఇప్పుడు సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘సేక్రెడ్ గేమ్స్’ను పాతాళ్ లోక్ పోలి ఉందంటూ కామెంట్స్ వస్తుండగా దీనిపై స్పందించిన అనుష్క.. రెండు సిరీస్‌ల మధ్య చాలా తేడా ఉందని చెప్పింది. ఓటీటీలో ప్రసారమవుతున్న వెబ్ సిరీస్‌లు ప్రత్యేకమైన కంటెంట్‌తో రూపొందుతున్నాయని, ప్రోత్సహించాలే తప్ప విమర్శలకు దిగరాదని చెప్పింది. ఈ సందర్భంగా తన వెబ్ సిరీస్ టీమ్‌ను అభినందించింది. అనుష్క శర్మ నిర్మించిన పాతాళ్ లోక్ సిరీస్‌కు అవినాష్ అరుణ్ దర్శకత్వం వహించగా నీరజ్ కబీ, అభిషేక్ బెనర్జీ, జైదీప్ అహ్లవత్ ప్రధాన పాత్రల్లో నటించారు.