ప్రైవేట్ బీచ్‌లో విరుష్క జంటతో ఆర్సీబీ పార్టీ

by Shyam |
ప్రైవేట్ బీచ్‌లో విరుష్క జంటతో ఆర్సీబీ పార్టీ
X

దిశ, స్పోర్ట్స్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) ఆడేందుకు దుబాయ్ చేరుకున్న విరాట్ కోహ్లీ అక్కడి నుంచే అభిమానులతో తాను తండ్రిని కాబోతున్నాననే శుభవార్త పంచుకున్నాడు. గత వారం రోజులుగా ఆర్సీబీ (RCB) జట్టుతో పాటు విరాట్, అనుష్కలు క్వారంటైన్‌లో ఉన్నారు. గడువు ముగియడంతో శుక్రవారం సాయంత్రం వాళ్లందరూ ఒక ప్రైవేట్ బీచ్‌లో సరదాగా గడిపారు.

తాము తల్లిదండ్రులం అవుతున్న సందర్భంగా కోహ్లీ, అనుష్కలు ఆర్సీబీ (RCB) జట్టు సభ్యులతో పాటు సిబ్బందికి చిన్న పార్టీ ఇచ్చారు. వీరిద్దరూ కేక్ కట్ చేసుకుని అందరి ముందు తమ సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. కాగా, శుక్రవారం క్వారంటైన్ ముగిసిన వెంటనే కొద్ది సేపు ప్రాక్టీస్ కూడా చేశారు. యూఏఈ నిబంధనల ప్రకారం 1వ, 3వ, 6వ రోజు కరోనా పరీక్షలు చేయించుకోవాలి. అయితే ఆర్సీబీ మాత్రం ప్రతీ రోజు పరీక్షలు చేయించుకున్నారు. అందరూ నెగెటివ్‌గా తేలడంతో ప్రాక్టీస్ మొదలు పెట్టి, అనంతరం ఒక ప్రైవేట్ బీచ్‌లో విరుష్క జంట ఇచ్చిన పార్టీకి హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి.

Advertisement

Next Story