- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తాలిబన్లు మహిళల పట్ల కర్కశంగా ప్రవర్తిస్తారు : ఆప్ఘన్ ఫిల్మ్ మేకర్
దిశ, సినిమా : ఆప్ఘనిస్తాన్ ఫిల్మ్ మేకర్ సహ్రా కరిమి తమ దేశంలో నెలకొన్న ప్రస్తుత సంఘటనలపై బహిరంగ లేఖ రాసింది. తాలిబన్లు ఆగస్టు 15న కాబూల్‌లోకి ప్రవేశించి ఆప్ఘనిస్తాన్‌ను స్వాధీనం చేసుకోగా.. అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకోవడం, తాలిబన్ గెలిచినట్లు ఆప్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచిపారిపోవడంతో పరిస్థితి మరింత దిగజారిందని తెలిపింది. కాగా సహ్రా కరిమి రాసిన ఈ లేఖను సోషల్ మీడియాలో షేర్ చేశాడు ఇండియన్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్. ఆప్ఘన్ వెలుపలి వాయిస్‌గా ఉండాలని గ్లోబల్ కమ్యూనిటీని కోరింది.
‘నా దేశంలో ఒక చిత్రనిర్మాతగా నేను చాలా కష్టపడి నిర్మించిన ప్రతి ఒక్కటి పడిపోయే ప్రమాదం ఉంది. తాలిబన్లు స్వాధీనం చేసుకుంటే వారు అన్ని కళలను నిషేధిస్తారు. నేను ఇతర చిత్రనిర్మాతలు వారి హిట్ జాబితాలో ఉండవచ్చు. వారు మహిళల హక్కులను కాలరాస్తారు. భావ వ్యక్తీకరణను అడ్డుకుంటారు. తాలిబన్లు అధికారంలో ఉన్నప్పుడు పాఠశాలలో బాలికల సంఖ్య సున్నా. కానీ ఇప్పుడు 9 మిలియన్లకు పైగా ఆఫ్ఘన్ బాలికలు స్కూల్‌కు వెళ్తున్నారు. అఫ్టనిస్తాన్‌కు చెందిన మూడవ అతిపెద్ద నగరం కాబూల్ విశ్వవిద్యాలయంలో దాదాపు 50శాతం మంది మహిళలు చదువుతున్నారు.