మొక్కలు నాటిన హీరోయిన్ అనుపమ

by  |   ( Updated:2020-07-21 07:54:43.0  )
మొక్కలు నాటిన హీరోయిన్ అనుపమ
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా నటి అనుపమ పరమేశ్వరన్ మొక్కలు నాటారు. నటి కల్యాణి ప్రియదర్శిని ఇచ్చిన ఛాలెంజ్‌ను స్వీకరించిన ఆమె కేరళలోని తిరుచానూరులోని నివాసంలో మొక్కలు నాటారు. ఈ విషయాన్ని ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్టు చేశారు. ఈ సందర్భంగా కాళిదాస్ జయరామ్, నివితా థామస్, ఆహన కృష్ణ, రాజీష్ విజయాన్, పద్మ సౌర్య, పిరలే మాన్య, గౌరీ కృష్ణ, గౌతమి నైరి, సిజ్జు విల్సన్, అను సితార, సితార కృష్ణ శంకర్, లక్ష్మీ ప్రియ విశాలను మొక్కలు నాటాలని ఛాలెంజ్ విసిరారు. అలాగే సినీ దర్శకులు సతీష్ వేగేశ్న విసిరిన ఛాలెంజ్‌ను స్వీకరించిన సినీ గేయ రచయిత శ్రీమణి శ్రీనగర్‌లోని తన నివాసం వద్ద మొక్కలు నాటారు. ఆయన చంద్రబోస్, ఆర్టిస్ట్ చింటూ, సినీ దర్శకుడు రమేష్ వర్మలకు ఛాలెంజ్ విసిరారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రతినిధి సుబ్బరాజు పాల్గొన్నారు.

Advertisement

Next Story