- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిట్లు లేవ్… టెస్టులు లేవ్..
దిశ, హలియా: ఓ పక్క లాక్ డౌన్ మరోపక్క ఎండ వేడిమి తాళ లేక కరోనా పరీక్షలు చేయించుకుందామని ఉదయాన్నే ఆరోగ్య కేంద్రానికి వస్తే అక్కడ యాంటిజెన్ టెస్ట్ కిట్లు లేని కారణంగా టెస్ట్ లు నిలిపివేశారు. టెస్టులు నిలిపి వేయడంతో కరోనా పరీక్షలు చేయించుకుందామని వచ్చినవారు వెనుదిరిగి వెళ్లారు. బుధవారం నాడు నాగార్జునసాగర్ నియోజకవర్గ పరిధిలోని త్రిపురారం, నిడమనూరు, గుర్రంపూడ్, మండల ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు నిలిచిపోయాయి. యాంటిజెన్ టెస్ట్ కిట్ల కొరత తోనే కరోనా పరీక్షలు నిలిపివేసినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఈ రోజు కేవలం హాలియా తిరుమలగిరిలో 30 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 9 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. పెద్దవూర ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 25 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా 10 పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారి శ్రీనివాస్ తెలిపారు.
ఇదిలా ఉంటే లాక్‌డౌన్ కారణంగా కరోనా పరీక్షల కోసం ప్రజలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకున్నారు. గతంలో లేని విధంగా ఈ మధ్య ఉపఎన్నికల తర్వాత కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతుండటంతో లక్షణాలు ఉన్నవారు ప్రతిరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వారి సంఖ్య పెరుగుతుంది. వచ్చిన వారందరికీ పరీక్షలు చేయకపోవడంతో వెనుతిరుగుతున్నారు. లక్షణాలతో బాధపడేవారు పరీక్షల కోసం వేచి ఉండి తమ వంతు వచ్చేసరికి ప్రాణాలను కోల్పోయేలా ఉన్నామంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా వైద్య అధికారులు దృష్టి సారించి యాంటీజెన్ టెస్ట్ కిట్లు తొందరగా వచ్చేలా చూసి కరోనా పరీక్షలు ప్రారంభించాలని వేడుకుంటున్నారు.