శ్రీకాకుళంలో యాంటీ కరోనా టన్నెల్

by srinivas |   ( Updated:2020-04-08 02:48:49.0  )
శ్రీకాకుళంలో యాంటీ కరోనా టన్నెల్
X

ఏపీలో ఇప్పటి వరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాని జిల్లాగా శ్రీకాకుళం గుర్తింపు పొందింది. అయితే అక్కడి అధికారులు మందు జాగ్రత్తగా విన్నూత ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. జిల్లా కేంద్రంలో జనసందోహం ఎక్కువగా ఉండే మార్కెట్ ప్రాంతంలో ‘కరోనా నిరోధక టన్నెల్’ ను ఏర్పాటు చేశారు. దీన్ని కలెక్టర్ నివాస్ ప్రారంభించారు.
అధునాత సాంకేతికతతో ఏర్పాటు చేసిన టన్నెల్లో నిరంతరం సోడియం హైపో క్లోరైడ్ స్ర్పే అవుతుంటుంది. దీనిలోకి ఒక్కసారి వెళ్లివచ్చిన వారికి ఇన్ ఫెక్షన్స్ సోకవని అధికారులు తెలిపారు.
రూ. లక్ష రూపాయల వ్యయంతో దీన్ని తయారు చేశామని, త్వరలోనే ఇచ్ఛాపురం, పలాస కాశీబుగ్గ, ఆమదాలవలస మునిసిపాలిటీలతో పాటు, పాలకొండ, రాజాం నగర పంచాయతీల్లోనూ ఇదే తరహా టన్నెల్స్‌ను ఏర్పాటు చేస్తామని అధికారులు వెల్లడించారు.

Tags: aunty caorna tanel, srikakulam, ap news

Advertisement

Next Story