- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇండియన్ స్ట్రెయిన్‌ను కొవాగ్జిన్ నిలువరిస్తుంది: ఫౌచీ
న్యూఢిల్లీ: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ టీకా ఇండియన్ డబుల్ మ్యుటెంట్ స్ట్రెయిన్‌ను విజయవంతంగా నిలువరిస్తుందని అమెరికా వైట్‌హౌజ్ చీఫ్ మెడికల్ అడ్వైజర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు. ప్రతి రోజూ తాము డేటాను పరిశీలిస్తున్నామని, రీసెంట్ డేటా ప్రకారం, కొవాగ్జిన్ ఇండియన్ స్ట్రెయిన్ నుంచి రక్షణ కల్పిస్తున్నదని తేలిందని వివరించారు. బీ.1.617ను కొవాగ్జిన్ టీకా నాశనం చేస్తున్నదని తెలుస్తున్నదని చెప్పారు. కాబట్టి ప్రస్తుత సంకట పరిస్థితులను అధిగమించాలంటే వ్యాక్సినేషన్ సరైన దారి అని సూచించారు.
అలాగే, ప్రపంచదేశాలు సరైన సమయంలో భారత్‌కు సహకారమందించలేదని అన్నారు. విశ్వవ్యాపిత మహమ్మారిని ఎదుర్కోవాలంటే అన్ని దేశాలూ ఒకదానికొకటి సంకటపరిస్థితుల్లో సహకరించుకోవడం కీలకమని తెలిపారు. కాగా, ఇండియన్ స్ట్రెయిన్‌ను కొవాగ్జిన్‌తోపాటు కొవిషీల్డ్ కూడా సమర్థవంతంగా నిర్మూలిస్తున్నదని మరో అధ్యయనం ఒకటి వివరించింది. ఈ రెండు టీకాలు వేసుకున్న తర్వాత పలువురిపై తాము ప్రయోగాలు చేశామని, ఇందులో ఇవి బీ.1.617ను నివారిస్తున్నట్టు తేలిందని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్స్ అండ్ ఇంటిగ్రేటివ్ బయాలజీ డైరెక్టర్ అనురాగ్ అగ్రవాల్ వివరించారు.