లాక్ డౌన్ తరువాత మరో వేవ్.. నిర్లక్ష్యం వహిస్తే పెను ప్రమాదమే..!

by Anukaran |   ( Updated:2021-06-03 20:27:47.0  )
Nilofor
X

దిశ, తెలంగాణ బ్యూరో: లాక్ డౌన్‌తో తగ్గుముఖం పట్టిన కేసులు లాక్ డౌన్ తరువాత గణనీయంగా పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కోవిడ్ నిబంధనలను విస్మరించి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే పెనుప్రమాదం పొంచి ఉంది. వ్యాధిని ఎదుర్కొనేందుకు కావల్సిన టీకాలు డిమాండ్ తగిన సప్లే లేకపోవడంతో వ్యాక్సినేషన్ కేవలం అర్బన్ ప్రాంతాలకు మాత్రమే పరిమితమయ్యాయి.

గ్రామీణ ప్రాంతాలకు వ్యాక్సిన్ అందించాలంటే 3నెల నెలల పాటు వేచిచూడక తప్పడం లేదు. రూరల్ ఏరియాలో బ్లాక్ ఫంగస్ పెరగడంతో వరంగల్, నిజామాబాద్ ఆసుపత్రుల్లో కూడా ప్రభుత్వం చికిత్సలను మొదలు పెట్టింది. పోస్ట్ కోవిడ్ తో చిన్నారులకు ఎంఐఎస్-సి వ్యాధి సోకుతుండటం ఆందోళనను కలిగిస్తుంది.

ఊహించని రీతిలో పెరిగిపోతున్న కేసులను, నమోదువుతున్న మరణాలను అదుపు చేసేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ను విధించింది, ప్రభుత్వం చేపట్టిన కఠిన చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గిపోయాయి. రోజుకు అత్యధికంగా 7వేల వరకు నమోదైన కేసులు ప్రస్తుతం 2వేల వరకు మాత్రమే నమోదవుతున్నాయి. వ్యాధి నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. పరిస్థితి అదుపులోకి వచ్చిందని భావించి ప్రభుత్వం లాక్ డౌన్ ఎత్తివేస్తే పెను ప్రమాదం పొంచి ఉందని డీఎంఈ రమేష్ రెడ్డి హెచ్చరించారు.

లాక్ డౌన్ అనంతరం నిర్లక్ష్యం వహిస్తే కొత్తవేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఏమాత్రం అతిక్రమించిన తిరిగి గత నెల పరిస్థితులను చవిచూడవల్సి వస్తుంది. వేగంగా రూపాంతరం చెందుతున్న వైరస్ పట్ల ఎప్పటికి జాగ్రత్తగా ఉండాల్సిందే.

గ్రామాల్లో 3నెలల తరువాతే వ్యాక్సిన్

డిమాండ్‌కు తగినంతగా వ్యాక్సిన్ సప్లే లేకపోవడం వలన ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ను అందించలేకపోతుంది. పట్టణ,నగర ప్రాంతాల్లోని సూపర్ స్ప్రెడర్స్ మాత్రమే వ్యాక్సిన్ అందిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అందుబాటులో ఉన్న 9 లక్షల వ్యాక్సిన్ ను కేటగిరిల వారిగా అర్బన్ ప్రాంతాల్లో మాత్రమే పంపిణీ చేపడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సిన్ ను అందించేందుకు మరో 3నెలల సమయం పడుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఆగస్ట్ నెల తరువాత కేంద్ర నుంచి భారీగా వ్యాక్సిన్ డోసులు వస్తేనే గ్రామీణ స్థాయిలో కూడా వ్యాక్సిన్ పంపిణీ చేసే అవకాశాలున్నాయి. అప్పటి వరకు గ్రామీణ ప్రజలు కరోనా భారిన పడకుండా కఠిన మైన ఆంక్షలు చేపట్టక తప్పదు.

నిజామాబాద్,వరంగల్ లో బ్లాక్ ఫంగస్ చికిత్సలు

కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. పోస్ట్ కోవిడ్ తరువాత విజృంభిస్తున్న ఈ వ్యాధితో గ్రామాల్లో భారీగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవుతున్నాయి. గ్రామీణ ప్రజలకు చికిత్సలందించేందుకు ప్రభుత్వం వరంగల్ లోని ఎంజీఎం , నిజామాబాద్ లోని జనరల్ ఆసుపత్రిల్లో బ్లాక్ ఫంగస్ కు చికిత్సలు ప్రారంభించారు. ఇప్పటి వరకు 1800 పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదవగా వీటిలో కోఠీ ఈఎన్‌టీ ఆసుపత్రిలో 250 మందికి, గాంధీ ఆసుపత్రిలో 100 మందికి మొత్తం 350 మందికి ప్రభుత్వం శస్త్రచకిత్సలను అందించింది.

చిన్నారులకు ఎంఐఎస్-సి వ్యాధి

చిన్నారులకు పోస్ట్ కోవిడ్ వ్యాధిగా ఎంఐఎస్-సి (మల్టీ సిస్టం ఇన్‌ఫ్లేటమీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్) సంక్రమిస్తుంది. చాలా వరకు చిన్నారులకు సోకిన కరోనాలో స్వల్ప లక్షణాలే నమోదయ్యాయి. మూడు నాలుగు రోజుల్లోనే కోలుకోవడంతో తల్లిదండ్రులు అంతగా పట్టించుకోలేదు. చిన్నారులకు పోస్ట్ కోవిడ్ తో సోకుతున్న ఎంఐఎస్-సి వ్యాధి ఆందోళన కలిగిస్తుంది. ఈ వ్యాధి సోకిన చిన్నారులకు సరైన చికిత్సలు అందించకపోతే 5 నుంచి 6 రోజుల్లోపై చనిపోతున్నారు. చిన్నారులకు విపరీతమైన జ్వరం, కళ్లు ఎర్రబడటం, అధికంగా వంటి నొప్పులు లక్షణాలుంటే ఎంఐఎస్-సి వ్యాధిగా గుర్తించి వెంటనే చికిత్సలందించాలి.

వీలైనంత త్వరగా చికిత్సలందిచకపోతే పెను ప్రమాదంగా మారుతుంది. 5 నుంచి 18ఏళ్ల వయసులోపు పిల్లలు అధికంగా ఈ వ్యాధి భారిన పడుతున్నట్టుగా వైద్యులు గుర్తించారు. ముందస్తుగా అప్రమత్తమైన ప్రభుత్వం హైదరబాద్ నిలోఫోర్ ఆసుపత్రితో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల్లో చిన్నారులకు ప్రత్యేకంగా చికిత్సలకు ఏర్పాటు చేస్తుంది. ఎంఐఎస్-సి వ్యాధి సోకితే ఆలస్యం చేయకుండా వైద్యుల సంప్రదించాలని వైద్యాధికారులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed