త్వరలోనే మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.. మంత్రి కేటీఆర్ ప్రకటన

by  |   ( Updated:2021-12-13 07:19:57.0  )
త్వరలోనే మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్.. మంత్రి కేటీఆర్ ప్రకటన
X

దిశ, తెలంగాణ బ్యూరో: త్వరలోనే మరో వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభించనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్లాంట్ ఏర్పాటుకు ఇప్పటికే పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయని వెల్లడించారు. హైదరాబాద్ సనత్ నగర్ లో గల క్రీడా ప్రాంగణంలో సోమవారం స్వచ్ఛ తెలంగాణ-స్వచ్ఛ హైదరాబాద్ లో భాగంగా 1350 ఆటోలను మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమ్మద్ అలీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ప్రజల భాగస్వామ్యంతో స్వచ్ఛ నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్నామన్నారు. కేంద్రం స్వచ్ఛ సర్వేక్షన్, స్వచ్ఛ భారత్ లో భాగంగా ప్రకటిస్తున్న అవార్డుల్లో హైదరాబాద్ బెస్ట్ నగరంగా నిలుస్తుందని వెల్లడించారు.

ఎక్కడికక్కడ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి అభినందనలు తెలిపారు. ‘సఫాయి అన్న… నీకు సలాం’ అన్న ఒకే ఒక ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ సిబ్బందికి మూడుసార్లు గౌరవ వేతనాలు పెంచిన ఘనత కేసీఆర్ కే దక్కిందని, వారికి గౌరవప్రదమైన వేతనం అందజేస్తున్నామని వెల్లడించారు. గతంలో హైదరాబాద్‌లో 3,500 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అయ్యేదని, ప్రస్తుతం 6500ల మెట్రిక్ టన్నులు ఉత్పత్తి అవుతుందని వెల్లడించారు. ఆరేళ్లలో జీహెచ్ఎంసీకి 5750 పైచిలుకు స్వచ్ఛ ఆటోలను అందజేశామని తెలిపారు. జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద వేస్టు టు ఎనర్జీ ప్లాంట్‌ను జవహర్ నగర్ లో ఏర్పాటు చేశామని, 20 మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నామని తెలిపారు. మరో 28 మెగావాట్ల ఉత్పత్తి ప్లాంటు ఏర్పాటుకు పర్యావరణ అనుమతులు కూడా లభించాయని, త్వరలోనే ఏర్పాటు చేస్తామని తెలిపారు.

Advertisement

Next Story

Most Viewed