అడ్వకేట్ వామన్‌రావు మర్డర్ కేసులో మరో ట్విస్ట్…(ఆడియో)

by Sridhar Babu |   ( Updated:2021-05-05 04:11:17.0  )
అడ్వకేట్ వామన్‌రావు మర్డర్ కేసులో మరో ట్విస్ట్…(ఆడియో)
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో సంచలనం కల్గించిన హైకోర్టు అడ్వకేట్స్ గట్టు వామన్ రావు, పివి నాగమణిల హత్య కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఫిబ్రవరి 17న హత్య జరిగిన మరసటి రోజునే మాట్లాడినట్టుగా భావిస్తున్న ఈ ఆడియో కలకలం సృష్టిస్తోంది. ఈ హత్య కేసులో అసలైన వారి పేర్లు బయటకు రావడం లేదు. “వారు అనేక మందిని బలి చేశారు”. అంటూ మాట్లాడడంతో ఈ కేసు మరో కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఈ హత్య కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన పుట్ట మధు మేనల్లుడు బిట్టు శ్రీను స్కెచ్ వేసి వేరో చోట ఉన్నాడని పోలీసుల కన్ఫెషన్ రిపోర్ట్‌లో తెలిపారు. కానీ ఈ ఆడియోలో మాత్రం బిట్టు శ్రీనునే నిందితులు ట్రావెల్ చేసిన కారును నడిపినట్టుగా ఓ వ్యక్తి మాట్లాడడం కలకలం సృష్టిస్తోంది.

హత్య కేసులో తాను కూడా ఇరుక్కునే వాడినని చెప్తూ… వారు తనను కూడా రమ్మని ఫోన్ చేశారని టీఆర్ఎస్ నాయకుడు చెప్పారు. అయితే కోర్టులో తనపై ఉన్న కేసు వాయిదా ఉండడంతో తాను ఫోన్ సైలెంట్లో పెట్టినట్టు మరో వ్యక్తితో మాట్టాడిన విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వామన్ రావు కారును అడ్డంగా ముందుగా స్పాట్ వద్దకు చేరుకున్న బిట్టు శ్రీనునే తన కారును అడ్డంగా పెట్టాడని, తాను కూడా ఆ తరువాత పెద్దపల్లికి వెల్తుండగా కల్వచర్ల వద్ద ట్రాఫిక్ జాం కావడంతో విషయం తెలుసుకుంటే మర్డర్ జరిగిన విషయం చెప్పారన్నారు. తాను అక్కడి నుండే బిట్టు శ్రీనుకు ఫోన్ చేస్తు గాభర పడ్తు ఏమైందే అన్నా అంటూ అడిగాడని, గట్టు వామన్ రావు హత్య జరిగిందని చెప్తే నిజమా అన్న అంటే బిట్టు శ్రీను ఎదురు ప్రశ్నించాడని వివరించారు. ఈ కేసుకు సంబంధించిన ఆడియో కోసం ఈ కింది లింక్‌ను క్లిక్ చేయండి

WhatsApp Audio 2021-05-05 at 3.01.30 PM

Advertisement

Next Story

Most Viewed