కరోనాతో మరో మావోయిస్టు అగ్రనేత మృతి..

by Sumithra |
maoist vinod
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా మహమ్మరి మావోయిస్టులను కలవర పెడుతోంది. ఇటీవలే మావోయిస్టు కమిటీలోని అగ్రనేతలు కరోనా బారినపడి తీవ్ర అవస్థలు పడుతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అంతేకాకుండా కరోనా సోకి ఇప్పటికే చాలా మంది మావోయిస్టులు మరణించారు.

అయితే ఇప్పుడు మరో మావోయిస్టు అగ్రనేత, దక్షిణ ప్రాంతీయ కమిటీ సభ్యుడు వినోద్ కరోనాతో తీవ్ర అనారోగ్యానికి గురై సోమవారం మరణించినట్లు భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. అంతేకాకుండా ఛత్తీస్‌ఘడ్ ప్రభుత్వం వినోద్ తలపై రూ.10 లక్షల రివార్డు ప్రకటించగా, ఎన్ఐఏ రూ.5 లక్షల రివార్డు ఉన్నట్లు ఎస్పీ సునీల్ దత్ వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed