బీహార్ దర్భంగా రైల్వేస్టేషన్ పేలుడు కేసులో మరో ఉగ్రవాది గుర్తింపు

by Sumithra |   ( Updated:2021-06-30 22:36:27.0  )
బీహార్ దర్భంగా రైల్వేస్టేషన్ పేలుడు కేసులో మరో ఉగ్రవాది గుర్తింపు
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లో ఎన్‌ఐఏ, ఇంటెలిజెన్స్ పోలీసులు జాయింట్ సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ ఆపరేషన్‌లో బీహార్ దర్భంగా రైల్వేస్టేషన్ పేలుడు కేసులో మరో ఉగ్రవాదిని గుర్తించారు. మాలిక్ బ్రదర్స్‌తో టచ్‌లో ఉంటూ బ్లాస్ట్ ప్లాన్‌లో మూడో వ్యక్తి ఇన్వాల్ అయినట్లు గుర్తించారు. మూడో వ్యక్తి హైదరాబాద్‌లోనే ఉన్నట్లు ఎన్‌ఐఏ వివరాలు సేకరించింది. ఇప్పటికే ఈ కేసులో మాలిక్ సోదరులను ఎన్‌ఐఏ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story