కేసీఆర్​ పేరుతో మరో స్కీం

by Shyam |
kcr family twitter trending
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో కేసీఆర్​ పేరుతో మరో కిట్​ అందుబాటులోకి రానుంది. ఇప్పటివరకు ప్రసవం తర్వాత కేసీఆర్​ కిట్​ను ఇస్తున్న సర్కార్​.. ఇక నుంచి గర్భిణీల్లో రక్తహీనతను నివారించేందుకు కేసీఆర్​ న్యూట్రీయంట్​ పేరిట మరో కిట్​ను పంపిణీ చేయనుంది. గర్భిణీలు, పుట్టబోయే శిశువుల్లో రక్తం వృద్ధి చెందేందుకు అవసరమైన పౌష్టికాహారాన్ని ఆ కిట్​లో ఉంచనున్నారు. ముఖ్యంగా ప్రోటీన్​ పౌడర్​, ఖర్జూర, ఇతర డ్రై ప్రూట్స్​, ఐరన్​, విటమిన్​ మాత్రలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.

సుమారు నాలుగు వేల రూపాయలు విలువ ఈ కిట్​ను మొదటి, రెండో యాంటినాటల్​ చెకప్ సమయంలో ప్రతీ గర్భిణీకి రెండు సార్లు ఇవ్వనున్నారు. ప్రతీ ఏటా సుమారు ఆరున్నర లక్షల మందికి ఈ కిట్లను అందించాల్సి వస్తుందని ఓ అధికారి తెలిపారు. ఇదే అంశంపై సీఎస్​ సోమేష్​కుమార్​ హెల్త్​ హెచ్​ఓడీలతో బుధవారం బీఆర్​కే భవన్​లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అతి త్వరలో విధివిధానాలు ఖరారు చేయనున్నారు.

Advertisement

Next Story