గడ్డం పెంచిన ఒమర్.. గుర్తుపట్టారా?

by Shamantha N |
గడ్డం పెంచిన ఒమర్.. గుర్తుపట్టారా?
X

జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా కొత్త ఫొటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. డాక్టర్‌తో కలిసి ఫొటో దిగిన ఒమర్ పెద్దగా గడ్డం పెంచేశారు. ఎప్పడూ ఆయన నీట్ షేవ్‌‌తో కనిపించే వారు. ప్రస్తుతం నిశితంగా చూస్తే గానీ ఆయనే ఒమర్ అబ్దుల్లా అని గుర్తించలేని పరిస్థితి. అధికరణం 370 రద్దు చేసినప్పటి నుంచి అంటే.. 2019, ఆగస్టు 5వ నుంచి ఒమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్‌లోని హరినివాస్‌లో గృహ నిర్బంధంలో ఉన్నారు. ఆయన నిర్బంధంలో ఉన్నప్పటి నుంచి బయటకు వచ్చిన ఫొటోల్లో ఇది మూడోది. అంతకుముందు, 2019, అక్టోబర్, 2020, జనవరిల్లో దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.

Tags: new-photo, omar-abdullah, detention, august

Advertisement

Next Story