ఖ‌మ్మం జిల్లాలో మ‌రో ఐటీ హ‌బ్

by Sridhar Babu |
Khammam
X

దిశ‌, ఖ‌మ్మం టౌన్: ఖ‌మ్మం న‌గ‌రానికి మ‌రో ఐటీహ‌బ్ మంజూర‌య్యింది. ఈ మేర‌కు రాష్ట్ర ప్రభుత్వం సోమ‌వారం ప‌రిపాల‌నా అనుమతులు మంజూరు చేసింది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి ఫలించింది. దాదాపు రూ.36 కోట్లతో 55 వేల చదరపు అడుగులతో ఐటీహబ్-2 నిర్మాణం చేయ‌నున్నారు. ఒకేసారి 570 మంది వర్క్ చేసుకునే వెసులుబాటుతో విశాలమైన సముదాయం నిర్మాణ పనులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఖమ్మంలోని ఇల్లందు నియోజకవర్గ సర్కిల్ వద్ద గల ప్రస్తుత ఐటీ హబ్-1 ఇప్పటికే ప్రారంభించి సేవలు నిర్విరామంగా కొనసాగిస్తున్నాయి. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కృషి మేరకు నేడు ఐటీ హ‌బ్‌-2కు పరిపాలన అనుమతులు రావడంతో జిల్లా యువతలో మరింత ఆనంద‌రం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నిరుద్యోగులకు మరిన్ని అవకాశాలు ఖమ్మం గుమ్మంలోనే అందుబాటులోకి రానున్నాయి. అతి త్వరలో ఆయా టవర్ నిర్మాణ పనులకు రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

Advertisement

Next Story