యువతులిద్దరూ ఫ్రెండ్స్.. యువకుడు సీక్రెట్ లవ్ ట్రాక్.. ఇంతలో ట్విస్ట్

by Anukaran |   ( Updated:2021-11-07 23:42:11.0  )
యువతులిద్దరూ ఫ్రెండ్స్.. యువకుడు సీక్రెట్ లవ్ ట్రాక్.. ఇంతలో ట్విస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్ : తనని కాదని వేరే అమ్మాయితో పెళ్లికి రెడీ అయిన యువకుడికి కాబోయే భార్యపై సదరు యువతి దాడికి దిగింది. ఈ క్రమంలో దాడి చేసిన యువతి జైలుపాలైంది. వివరాల ప్రకారం.. శిడ్లఘట్ట తాలూకా ఆనేమడుగు గ్రామానికి చెందిన గంగోత్రి (20), మోనిక (19) అనే ఇద్దరు అమ్మాయిలు స్నేహితులు. వీరిద్దరిని గంగరాజు (20) అనే యువకుడు ఒకరికి తెలియకుండా మరొకరిని ప్రేమించాడు.

ఈ క్రమంలో ఇటీవలే మోనిక-గంగరాజుకు వివాహం జరిపేందుకు కుటుంబ సభ్యులు ముహుర్తం ఫిక్స్ చేశారు. దీంతో మోనికపై కోపం పెంచుకున్న గంగోత్రి.. ఆదివారం మోనికపై దాడి చేసింది. చాకుతో చేతికి, మెడ దగ్గర గాయపరిచింది. అది గమనించిన మోనిక కుటుంబ సభ్యులు వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలోనే పోలీసులు గంగోత్రిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.

Advertisement

Next Story

Most Viewed