వరంగల్ ఎంజీఎంలో మరో కరోనా మరణం

by vinod kumar |
వరంగల్ ఎంజీఎంలో మరో కరోనా మరణం
X

దిశ, వరంగల్: వరంగల్ ఎంజీఎంలో కరోనా లక్షణాలతో‌ మరొకరు మృతి చెందారు. హన్మకొండ గోపాలపూర్ ఎఫ్‌సీ‌ఐ కాలనీకి చెందిన యువతి కరోనా లక్షణాలతో బాధపడుతుండడంతో కొద్ది రోజుల క్రితం కుటుంబ సభ్యులు ఆమెను ఎంజీఎంలో ఆస్పత్రిలో చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతిచెందింది. ఈ విషయాన్ని వైద్యులు వెల్లడించారు. దీంతో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు ఎఫ్‌సీ‌ఐ కాలనీలో హైపో క్లోరినేషన్ చేస్తున్నారు.

Advertisement

Next Story