సింగరేణిలో ప్రమాదం.. విషయం దాచిపెడుతున్న అధికారులు

by Sridhar Babu |
Singareni-1
X

దిశ, భూపాలపల్లి: జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి ఏరియాలోని కేటీకే ఒకటవ గనిలో గురువారం మొదటి షిఫ్ట్ లో జరిగిన రెండు ప్రమాదాల్లో ఇద్దరు కార్మికులకు గాయాలయ్యాయి. గనిలోని ఒకటవ సీం, మెయిన్ డిప్, పదమూడవ లెవల్లో ఆరుగురు కార్మికులు పని చేస్తున్నారు. గడ్డర్స్ మార్చుతుండగా గడ్డర్స్ పై ఉండే సిమెంట్ బిల్లలు ఊడిపడినాయని కార్మికులు అంటున్నారు. ఐదుగురు కార్మికులు తప్పించుకోగా జనరల్ మద్దూర్ కార్మికుడు సలీంకు గాయాలయ్యాయి. ఆయనను సింగరేణి ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మూడవవ సీం, ఎస్ -11,25 అండ్ ఆఫ్ డిప్, 22 లెవల్లో ఎల్డీఎల్ యంత్రం బొగ్గు ఉత్పత్తి చేస్తోంది. మల్లయ్య అనే కోల్ కట్టర్ కార్మి కుడికి యంత్రం తగలడంతో గాయపడ్డాడు. ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Singareni-2

కేటీకే ఒకటవ గనిలో ఫస్ట్ షిఫ్ట్ లో పని చేస్తున్న ఇద్దరు కార్మికులకు పైన రూప్ గోడలు కూలి ఇద్దరు కార్మికులు గాయపడినారు. ప్రమాదంలో ఒకరికి కాలు పైన నుండి ఎస్.డి.ఎల్ వాహనం దూసుకెళ్లడంతో అతని కాలు విరిగింది. దీంతో అతడిని స్థానిక సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడ్డ మరో కార్మికుడిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి తరలించారు.

ప్రమాదం విషయాన్ని గోప్యంగా ఉంచిన సింగరేణి అధికారులు

కాగా సింగరేణిలో గురువారం ఉదయం జరిగిన సంఘటనను అధికారులు రహస్యంగా ఉంచడంలో మతలబు ఏమిటని సింగరేణి వర్గాలు అంటున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే పై అధికారులకు, కుటుంబ సభ్యులకు తెలుపవలసిన అధికారులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించి మీడియాకు సైతం తెలియకుండా రహస్యంగా ఉంచారు. అధికారుల నిర్లక్ష్యం వల్లనే ప్రమాదం జరగడంతో మీడియాలో ప్రచారం జరగకుండా జాగ్రత్త వహించారు. ప్రమాద విషయాలు బయటకు చెప్పకపోవడం పట్ల అధికారులు ఎందుకు జాగ్రత్తగా తీసుకున్నారని అర్థం కావడం లేదు.

Advertisement

Next Story