- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఏపీలో ఒక్కరోజే 130 పాజిటివ్ కేసులు
దిశ, ఏపీబ్యూరో: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య మూడంకెల్లో నమోదవుతుండటం ఆందోళనకరం. తాజాగా, 17,695 శాంపిళ్లను పరీక్షించగా, 130మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఈ విషయాన్ని ఏపీ వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. కొత్తగా వెలుగుచూసిన 130 కేసులతో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 3,719కి చేరింది. అలాగే, శనివారం ఉదయం 9నుంచి ఆదివారం ఉదయం 9గంటల వరకు 30మంది వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2,353కి పెరిగింది. ఇదే సమయంలో కరోనా మహమ్మారి బారినపడి కృష్ణా జిల్లాలో ఒక్కరు, కర్నూల్ జిల్లాలో ఒక్కరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 75కు చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 1,290 యాక్టివ్ కేసులున్నాయి.
ఇదిలా ఉండగా, విదేశాల నుంచి వచ్చినవారిలో ఇప్పటివరకు 131 మంది కరోనా బారినపడగా, ప్రస్తుతం 126 మంది చికిత్స పొందుతున్నారు. అలాగే, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చినవారిలో 810 మందికి కొవిడ్ 19సోకగా, ప్రస్తుతం 508 మంది చికిత్స పొందుతున్నారు. ఈ కేసులనూ కలిపితే ఏపీలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 4,659గా ఉంది.