కేంద్ర స్కాలర్ షిపులకు వార్షిక ఆదాయం పెంపు

by Shyam |
కేంద్ర స్కాలర్ షిపులకు వార్షిక ఆదాయం పెంపు
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఓబీసీ, ఈబీసీ, డీఎన్‌టీ (డీనోటిఫైడ్‌, నోమాడ్స్‌, సెమీ నోమాడ్స్‌) విద్యార్ధులు కేంద్ర స్కాలప్​షిపులు పొందేందుకు కుటుంబ వార్షిక ఆదాయ పరిమితి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి బి వెంకటేశ్వర్లు సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఓబీసీలు పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ పొందేందుకు ప్రస్తుతం ఫ్యామిలీ ఇన్‌కం లిమిట్‌ రూ. 1.5లక్షలుగా ఉండగా, దీన్ని రూ. 2.5లక్షలకు పెంచారు. ఈబీసీలకు డాక్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ పోస్ట్‌మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌కు సంవత్సరాదాయం ఇప్పుడు లక్ష ఉండగా, రూ. 2.5లక్షలకు పెంచారు. ఇక డీఎన్‌టీకి డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ప్రి, పోస్ట్‌ మెట్రిక్ స్కాలర్‌షిప్‌కు రూ. 2లక్షల నుంచి రూ. 2.50లక్షలకు సవరించారు.

Advertisement

Next Story

Most Viewed