పవర్ లిఫ్టింగ్ విజేతలుగా "బంగారు" బాలికలు

by Shyam |
పవర్ లిఫ్టింగ్ విజేతలుగా బంగారు బాలికలు
X

దిశ, హైదరాబాద్: రామంతాపూర్‌లో బజరంగ్ వ్యాయామశాల పవర్ లిప్టింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించారు. ఈ చాంపియన్ షిప్‌లో జింఖానా మైదానం నుంచి పాల్గొన్న ఆరుగురు బాలికలు గెలుపొందారు. 43 కిలోల కేటగిరీలో తబస్సుమ్ ఫాతిమా బంగారం పతకం సాధించింది. 52 కిలోల కేటగిరీలో ఎస్.ప్రవళిక, 69 కేజీల కేటగిరీలో ఎ.అర్చన, 84+ కిలోల కేటగిరీలో ఎ.గాయత్రి, వి.ఝాన్సీ రాణి బంగారు పతకం సాధించారు. ఆర్.రమ్య 63 కేజీల కేటగిరీలో రజత పతకం సాధించింది. ఈ కార్యక్రమంలో పవర్ లిప్టింగ్ కోచ్ హేమలత, ఉద్భవ్ పాఠశాల ప్రిన్సిపాల్, పీ.ఈ.టీ.శ్రవణ్, బజరంగ్ వ్యాయామశాల అధ్యక్షుడు జి.సునీల్ కుమార్, ప్రధాన కార్యదర్శి జోసెఫ్ జేమ్స్, కోశాధికారి ఆర్. సదానంద, కోచ్‌లు పాల్గొన్నారు.

Advertisement

Next Story