పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థులు వీళ్లే..

by Shyam |
పట్టభద్రుల ఎమ్మెల్సీ కాంగ్రెస్​ అభ్యర్థులు వీళ్లే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో త్వరలో జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే అధికార పార్టీ ఒక స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది. తాజాగా కాంగ్రెస్​ పార్టీ కూడా రెండు స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసి ప్రకటన విడుదల చేసింది. నల్లగొండ-వరంగల్-ఖమ్మం అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిగా మాజీ మంత్రి చిన్నారెడ్డిని ఎంపిక చేసినట్లు ఏఐసీసీ తరుపున ముఖుల్​ వాస్నిక్​ ప్రకటించారు.

ఈ రెండు ఎమ్మెల్సీ స్థానాలపై కాంగ్రెస్​ పార్టీ గెలుపు ఆశలు పెట్టుకుంది. ఇక్కడ పోటీ చేసేందుకు పార్టీ నుంచి పలువురు పోటీ పడ్డారు. దీంతో ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్​ మాణిక్కం ఠాగూర్​ అభిప్రాయసేకరణ చేశారు. అనంతరం నివేదికను ఏఐసీసీకి పంపించారు. రాష్ట్ర పార్టీ నేతల అభిప్రాయం మేరకు రాములు నాయక్​, చిన్నారెడ్డిలను ఎంపిక చేశారు.

అయితే ఇప్పటికే కరీంనగర్​ స్థానం నుంచి జీవన్​రెడ్డి గెలుపొందడంతో కాంగ్రెస్​ ఇక్కడ కూడా గెలుస్తామనే ధీమాతో ఉంది. అయితే అంతకు ముందు దుబ్బాక ఉప ఎన్నికలు, గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కానీ ఈ స్థానాల్లో మాత్రం అవకాశాలు ఉంటాయని భావిస్తున్నారు.

Advertisement

Next Story