హాస్పిటల్ నుంచి డిశ్చార్జైన శశికళ

by Shamantha N |
హాస్పిటల్ నుంచి డిశ్చార్జైన శశికళ
X

బెంగళూరు: తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి వీకే శశికళ ఆదివారం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్లు శిక్ష అనుభవించి గతవారంలోనే ఆమె విడుదలైన సంగతి తెలిసిందే. శ్వాససంబంధ సమస్యలతో ఆమె బెంగళూరులోని విక్టోరియా హాస్పిటల్‌లో చికిత్స పొందారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉన్నదని హాస్పిటల్ వెల్లడించింది. పదిరోజుల చికిత్స పూర్తి చేసుకున్న శశికళకు కరోనా లక్షణాలు నయమయ్యాయని, ప్రొటోకాల్ ప్రకారం ఆమెను డిశ్చార్జ్ చేయవచ్చునని బులెటిన్‌లో తెలిపింది.

ఆదివారం మధ్యాహ్నం ఆమె వీల్ చైర్‌పై ఆస్పత్రి వెలుపలికి రాగానే మద్దతుదారులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. వారికి నమస్కరిస్తూ ఆమె కారులోకి ఎక్కారు. కొన్నాళ్లు ఆమె బెంగళూరులోనే ఉండనున్నట్టు తెలిసింది. ఫిబ్రవరి 8వ తేదీన తిరిగి చెన్నైకి వెళ్లనున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆమె విడుదలకు ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమెను హాస్పిటల్ నుంచి పికప్ చేసుకున్న కారుకు ముందు ఏఐఏడీఎంకే జెండా ఉండటం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికలకు చిన్నమ్మ నుంచి వచ్చిన తొలి సంకేతంగా దీన్ని అభివర్ణిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed