- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'అది చాలా భయంకరం.. మేము చెప్పలేకపోతున్నాం'
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా భూతం విలయతాండవం సృష్టిస్తున్నది. ఆ మహమ్మారి కోరలకు చిక్కి ఎంతోమంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటికే చాలామంది చనిపోయారు. దీంతో జనాలు అల్లకల్లోలమవుతున్నారు. ఈ భూతాన్ని కట్టడి చేసేందుకు ఆయా దేశాలు లాక్ డౌన్ ను కొనసాగిస్తున్నాయి. అయితే లాక్ డౌన్ కారణంగా పాకిస్థాన్ లో పెంపుడు జంతువులు పెద్ద సంఖ్యలో చనిపోయాయి. కరాచీ, లాహోర్ లాంటి ప్రధాన నగరాల్లో వుండే పెంపుడు జంతువులు విక్రయించే మార్కెట్లలో కుక్కలు, పిల్లులు, కుందేళ్లు, ఇతర పెంపుడు జంతువులు చనిపోయాయి. లాక్ డౌన్ కారణంగా ఆయా దుకాణాలు మూతపడ్డాయి. వాటిని కాపాడేందుకు యజమానులకు మార్గం లేకుండా పోయింది. దీంతో అవి ఆ షాపుల్లో చిక్కి ఆహారం లేక చనిపోయాయి. పెంపుడు జంతువులను విక్రయించే దుకాణదారులంతా కలిసి ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. దీంతో పోలీసులు ఆ షాపులను తెరిపించారు. కానీ, అప్పటికే పెద్దసంఖ్యలో ఆ దుకాణాలలో ఆ మూగజీవాలు చనిపోయాయి. కొన్నిటిని మాత్రమే రక్షించగలిగారు. ఈ విషయం గూర్చి అక్కడి మీడియా ఆ దుకాణదారులను అడుగగా ఈ ఘటన చాలా భయంకరం.. మేము మీకు చెప్పలేకపోతున్నామంటూ బాధపడుతున్నారు.
Tags: pakistan, animals, died, at market, corona effect