అంగన్ వాడీ టీచర్‌తో అల్లుడు ఎఫైర్.. స్కూల్ వెనక ఇద్దరు కలిసి..

by Sumithra |   ( Updated:2021-11-15 06:12:39.0  )
aunts
X

దిశ, వెబ్‌డెస్క్ : భార్యకు ఉద్యోగం.. భర్త వ్యాపారంతోపాటు వ్యవసాయం చేస్తూ ఆలుమగలు హాయిగా ఉంటున్నారు. సుఖ సంతోషాలతో సాగుతున్న వారి సంసారంలోకి భర్త మేనల్లుడు ప్రవేశించాడు. అత్తను ట్రాప్ చేసి మేనమామను మోసం చేశాడు. మామ బయటకు వెళ్లగానే ఇంట్లో దూరి అత్తతో రాసలీలలు సాగిస్తూ వారి కుటుంబాన్ని చిన్నాభిన్నం చేశాడు. అతడితో ఆ సంబంధాన్ని తెగదెంపులు చేసుకుందామనుకున్న అత్తను అందరూ చూస్తుండగానే అంతమొందించాడు. కర్ణాటకలో జరిగిన ఈ దారుణ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Murder

తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా హాల్కురుకు చెందిన రాజేశ్, భారతి(30) భార్యభర్తలు. రాజేశ్ వ్యవసాయం చేయిస్తూ బిజినెస్ చేస్తుంటాడు. భారతి గ్రామంలోనే అంగన్ వాడీ కేంద్రంలో టీచర్‌గా పని చేస్తోంది. ఉదయం భర్త తన పనులకు వెళ్లగా, భార్య అంగన్ వాడీ కేంద్రానికి వెళ్తుంది. ఇలా ఏ చీకుచింతా లేకుండా అన్యోన్యంగా సాగుతున్న వారి సంసారంలోకి భర్త అక్క కుమారుడు(మేనల్లుడు) దివాకర్ (25) వారి కుటుంబంలోకి ప్రవేశించాడు. తరచూ మేనమామ ఇంటికి వచ్చే దివాకర్.. క్రమంగా అత్తతో ఎఫైర్ పెట్టుకున్నాడు. ఇలా మేనమామ ఇంట్లో లేని సమయంలో వస్తూ అత్తతో రాసలీలలు సాగిస్తూ వస్తున్నాడు.

Illegal affair

అత్తా, అల్లుడి రొమాన్స్ శృతిమించడంతో విషయం బంధువుల వరకు చేరింది. భర్తతోపాటు అందరూ ఇద్దరిని మందలించారు. మరోసారి అలా చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. దీంతో భారతి అతడిని దూరం పెట్టడం ప్రారంభించింది. తన ఇంటికి, తన దగ్గరకు రావద్దని అల్లుడిని హెచ్చరించింది. అలా వారిద్దరి మధ్య పలుమార్లు వాగ్వాదం జరిగింది. అయితే దానిని జీర్ణించుకోని దివాకర్ అత్త పని చేస్తున్న అంగన్ వాడీ కేంద్రానికి వెళ్లాడు. ఆమెను స్కూల్ భవనం వెనకకు తీసుకెళ్లి.. ఇద్దరు కలిసి గంటల తరబడి గడిపారు. ఆ సమయంలో ఆకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. ఆమె అరుపులకు అంగన్ వాడీ సిబ్బంది అక్కడికి చేరుకోవడంతో వారిని కత్తితో బెదిరిస్తూ దివాకర్ పరారీ అయ్యాడు. సాక్ష్యం చెబితే మీకు కూడా ఇదే గతి పడుతుందని హెచ్చరించాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Advertisement

Next Story