అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం..

by Sumithra |
అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నం..
X

అంగన్‌వాడీ టీచర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం ఖమ్మం జిల్లా, తిరుమలాయపాలెం మండలం, జల్లేపల్లికి చెందిన చలువాది పద్మ అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. అయితే స్థానిక హెల్త్ సెంటర్ ఏఎన్ఎం తనను మానసికంగా వేధిస్తుండటంతో పాటు సీడీపీవో సైతం గత కొన్ని రోజులుగా తక్కువ చూపు చూస్తున్నారనే ఆవేదనతోనే ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

Tags: Suicide, Anganwadi teacher, Khammam, ANM, CDPO, Health centre

Advertisement

Next Story