ఆండ్రాయిడ్‌లో బ్రెయిలీ కీబోర్డు… అంధులకు వరం!

by  |
ఆండ్రాయిడ్‌లో బ్రెయిలీ కీబోర్డు… అంధులకు వరం!
X

దిశ, వెబ్‌డెస్క్: గత రెండేళ్లలో ఆండ్రాయిడ్ చాలా మంచి ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అయితే ఈ అన్ని ఫీచర్లను ఆండ్రాయిడ్ తానే సొంతంగా డెవలప్ చేసుకుంది. కానీ అంధులకు ఉపయోగపడే బ్రెయిలీ కీబోర్డ్ డెవలప్ కావాల్సినపుడు మాత్రం ఆండ్రాయిడ్ యూజర్లు డబ్బు చెల్లించి థర్డ్ పార్టీ సాయం తీసుకోవాల్సిన పరిస్థితి. అయితే ఎట్టకేలకు ఆండ్రాయిడ్‌లో బిల్ట్ ఇన్ బ్రెయిలీ కీబోర్డు అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇది వెర్షన్ 5 అంత కంటే ఎక్కువ ఆపరేటింగ్ సిస్టం ఉన్న పరికరాల్లో రానుంది.

ఇప్పటివరకు ఫోన్లలో ఎన్ని వాయిస్ రికార్డింగులు ఉన్నా, స్క్రీన్ రీడర్లు ఉన్నా… బ్రెయిలీ టైపింగ్ లోటు తీర్చలేకపోయాయి. అవి విరివిగా ఉపయోగిస్తున్నప్పటికీ వ్యక్తిగత స్వేచ్ఛ లేకుండా పోతోందన్న విమర్శ ఉండనే ఉంది. అంతేకాకుండా థర్డ్ పార్టీ నుంచి బ్రెయిలీ కీబోర్డ్ డౌన్‌లోడ్ చేసుకోవడం వల్ల సెక్యూరిటీ ఇష్యూలు కూడా వస్తున్నాయి. అందుకే ఈ సమస్యను అధిగమించడానికి గూగుల్ బ్రెయిలీ కీబోర్డు రెడీ చేసింది. ఈ కీబోర్డు ఉపయోగించడానికి యూజర్ ఫోన్‌ని అడ్డంగా తిప్పి ఉంచి, ఒకటి నుంచి ఆరు అంకెలు మీద బ్రెయిలీ కోడ్ ప్రకారం నొక్కవలసి ఉంటుంది. అలాగే ఆండ్రాయిడ్ టాక్ బ్యాక్ సాయంతో టైప్ చేసిన పదాలను వినే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇంగ్లీషులో మాత్రమే అందుబాటులో ఉన్న కీబోర్డుని త్వరలో ఇతర భాషల్లోకి కూడా తీసుకురానున్నారు. దీన్ని యాక్టివేట్ చేసుకోవడానికి ముందు ఆండ్రాయిడ్ అప్డేట్ చేసుకుని కీబోర్డు యాడ్ చేసుకుంటే సరిపోతుంది.

Tags: Android, Braille keyboard, visually impaired, Users, Android update

Advertisement

Next Story

Most Viewed