సూర్యకు జోడీగా ఆండ్రియా?

by Anukaran |
సూర్యకు జోడీగా ఆండ్రియా?
X

దిశ, వెబ్‌డెస్క్:

డైనమిక్ డైరెక్టర్ వెట్రిమారన్, సూపర్ స్టార్ సూర్య కాంబినేషన్‌లో వస్తున్న ‘వాడివసల్’ సినిమా కోసం కోలీవుడ్ ప్రేక్షకులు చాలా ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న సినిమాలో సూర్య ఫస్ట్ లుక్ ఇప్పటికే ఆడియన్స్‌ను ఆకట్టుకోగా.. షూటింగ్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉంది. కాగా, ఈ చిత్రంలో హాట్ గర్ల్ ఆండ్రియా కీలక పాత్రలో నటించబోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వెట్రిమారన్ డైరెక్షన్‌లో ‘వడ చెన్నై’ సినిమాలో ప్రధాన పాత్రలో కనిపించిన ఆండ్రియానే ఈ సినిమాలోనూ డైరెక్టర్ కంటిన్యూ చేస్తున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్ రోల్‌లో నటించబోతున్న ఆండ్రియా సూపర్ చాన్స్ కొట్టేయగా.. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది.

కాగా, ప్రస్తుతం ఆండ్రియా నటించిన మాస్టర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్, మాళవికా మోహనన్‌లు జంటగా నటించిన ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందని వార్తలు వచ్చాయి. కానీ, ఇదంతా ఫేక్ అని కొట్టిపారేసింది మూవీ యూనిట్. ఇక సూర్య నటించిన ‘ఆకాశమే నీ హద్దురా’ చిత్రం ఇప్పటికే ఓటీటీ రిలీజ్ కన్‌ఫర్మ్ చేసుకుని అక్టోబర్ 30న విడుదలకు సిద్ధంగా ఉంది.

Advertisement

Next Story