- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Pulivendula: జేఎన్టీయూ కాలేజ్ బీటెక్ ఫలితాలు విడుదల
దిశ,కడప: వైయస్సార్ జిల్లా పులివెందుల జేఎన్టీయూ కళాశాల బీటెక్ ఫలితాలను అధికారులు విడుదల చేశారు. బీటెక్ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్ (ఆర్19), బీటెక్ మూడవ సంవత్సరం రెండవ సెమిస్టర్ రెగ్యులర్(ఆర్20), బీటెక్ ప్రథమ, ద్వితీయ, తృతీయ, నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ సప్లిమెంటరీ (ఆర్15 మరియు ఆర్19) పరీక్షలను ఏప్రిల్ 2023లో నిర్వహించారు. ఈ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విడుదల చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఎస్.వసుంధర తెలిపారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీటెక్ మూడవ సంవత్సరం రెగ్యులర్ పరీక్షల్లో విద్యార్థులు 357 మంది నమోదు చేసుకోగా 320 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. బీటెక్ నాలుగవ సంవత్సరం రెగ్యులర్ పరీక్షల్లో విద్యార్థులు 352 మంది నమోదు చేసుకోగా 327 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారని తెలిపారు. పరీక్ష ఫలితాలను కళాశాలల వెబ్ సైట్‌లో పొందుపరిచామని, విద్యార్థులు తెలుసుకోవచ్చని తెలిపారు.